Tuesday, 25 October 2016

క్రీస్తు బలి

"సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెఱ్ఱితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి యున్నది. జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా? దేవుని జ్ఞానానుసారముగా (గాక) లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటన యను వెఱ్ఱితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను" (Iకొరింథీ.1:18-21).

క్రీస్తు సిలువ పాపులను రక్షించు దేవుని దయాపూర్వక సంకల్పమైయుంది. దీనిని దేవుడు జగత్తు పునాది వేయబడకమునుపే నియమించాడు (I పేతురు 1:20), పరమదేవుడు సత్యవంతుడైతే, ఆయన లోకము పుట్టకమునుపే నియమించిన క్రీస్తు సిలువ మరణం సత్యమైయుండి తీరాలి! బాహ్యమైన కన్నులకు, మనుష్య జ్ఞానానికి సిలువ ఓటమి, అసమర్థత వగైరాలుగా కన్పిస్తాయేగాని; అవి వాస్తవాలుకావు. సిలువలో నరునికి జ్ఞానం కన్పించదు. సిలువ చేతగానితనాన్ని అంగీకరించినట్టుగా లోకం భావించింది.

సిలువలో అపవాది క్రియలు లయపరచబడ్డాయి (I యోహాను 3:8). మరణ భయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించే శక్తి సిలువదై యంది (హెబ్రీ 2:14). మరణము యొక్క బలముగలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేసిన శక్తియే సిలువ. సిలువలో ఏ సూచక క్రియలు చేయబడలేదు. నజరేయుడైన యేసే యూదులు కనిపెట్టిన వారి మెస్సీయా అని నమ్మే సహృదయం వారికుండినట్టయితే, ఆయన వారి కన్నులయెదుట ఎన్నో సూచకక్రియలును, మహత్కార్యాలను చేశారు (యోహాను 2;23). యూదులు తమ కుతూహలం తీర్చుకొనడానికిగాను సూచకక్రియలు చూడగోరేవారని విశ్వసించడానికి కాదు.

అందువలననే, ఆయన సిలువమీద వ్రేలాడుచుండినప్పడు సహి తము, “ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగిరావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదుమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి" (మార్కు 15:32). (అద్భుతాలు) సూచకక్రియలు చేసే యేసునందలి విశ్వా సము రక్షించే విశ్వాసము కాదని, సిలువ వేయబడిన యేసు నందలి విశ్వాసమే రక్షించు విశ్వాసమైయుంటుందని ప్రభువైన యేసు నీకొదేమునకు వివరించారు (యోహాను 3:1-16). ఇది దేవుని జ్ఞానమైయుంది (I కొరింధీ 2:6-8).

క్రీస్తు సిలువ మరణం, విశ్వసించు వారిని, రక్షించే దేవుని శక్తియై యుండగా, దానిని విస్మరించి, యూదులు తమ వాడుక చొప్పున "సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్టులు జ్ఞానమును వెదకు చున్నారు. అపొస్తలులైతే సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నారు. “ఆయన (సిలువ వేయబడిన యేసు) యూదులకు ఆటంకముగాను, అన్య జనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు! (I కొరింధీ, 1:23-24)

మొదటి శతాబ్దపు మధ్యకాలంనుండి, సిలువ సందేశాన్ని సువార్తగా వ్యతిరేకించబూనిన యూదులు, గ్రీకు తత్వశాస్త్రంతో ఏకీభవించారు. ఈ రెండింటి సమ్మేళనం వలన జ్ఞానతత్వం (Gnostic Philosophy) ఉద్భవించింది. "లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను" అనే అపొస్తలుల సువార్తసందేశాన్ని వ్యతిరేకించడమే ఆ ఫిలాసఫీయొక్క ముఖ్య ఉద్దేశం.

సిలువ సందేశం అపవాదికి తంపరం, చిరాకు పుట్టిస్తుంది. అందువలన దానిని కౌంటర్ చేయడం, వాని గురియైయుంది. కొలొస్సై సంఘములో అపవాది తన కార్యకలాపాలలో సంఘాన్ని కలతపరచనారంభించాడు. గనుక పరిశుద్దాత్మ ఈ చర్యలను ప్రతిఘటించడానికిగాను, యిలా విషయాన్ని బయలు పరచాడు: "మరియు గతకాలమందు దేవునికి దూరస్తులును, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునైయుండిన మిమ్మునుకూడ తన సన్నిధిని పరిశుద్దులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను" (కొలొస్సై 1:21-22)

"పునాది మీద కట్టబడినవారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు, ఆకాశము క్రిందఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచియుండినయెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరచారకుడనైతిని" (కొలొస్సై 1:23) ఈ సువార్త సందేశం మొదటి శతాబ్దంలోనే ఆకాశము క్రిందనున్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టును, అది లోకమందంతట ఫలించుచు విస్తరించుచున్నట్టు తెలుపబడింది.

వెుదటి శతాబ్దంలోనే ఈ సువార్త ఫలించి వ్యాపిస్తుండగా, జ్ఞానతత్వవేత్తలు దాన్ని ఆటంకపరచ జూచారు. సిలువను గూర్చినవార్త నశించేవారికి వెఱ్ఱితనం, అపవాదికి తలనొప్పియునైయుండినందున, చరిత్రలో మరెప్పుడైనా అలాటిపరిస్థితి ఎదురుకావచ్చు. అలాగయ్యిందంటే, ఆశ్చర్యపోవలసిన అవసరంలేదు. అది కేవలం అపవాది క్రియగా భావించి త్రోసివేయవచ్చు.

సిలువను గూర్చిన వార్త నశించుచున్నవానికి వెఱ్ఱితనంగా ఉంటుందని మొదటి శతాబ్దంలో పరిశుద్దాత్మయే తెలిపాడు, రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తియైయున్నది.

Source : దేవుని అనాది మర్మమైన క్రీస్తు బలి by Br G. Devadanam

4 comments:

  1. Great bro devadhanam selut you

    ReplyDelete
  2. Super sir 👌👌 inka ఇలాంటి మంచి పుస్తకాలు మాకు అవసరం మాకు పంపండి sir 7032327307

    ReplyDelete
  3. Church of christ Trueth 🙏

    ReplyDelete