లోకంలో వందలాది (1600 పైచిలుకు) భాషల్లోనికి తర్జుమా చేయబడుతూ, వేలాది సంవత్సరాలుగా ఉనికిలో ఉండి, లక్షలాది మందిచే అనుదినం పఠించబడుతూ, కోట్లాదిమంది అభిమానాన్ని నేటికిని చూరగొంటున్న అతి ప్రాచీన గ్రంథం-బైబిలు!
కాలగమనంలో సామ్రాజ్యాలు విజృంభించిలేచి, మరెన్నటికి కనబడకుండా రాలిపడిపోయాయి. భూమిని వణకించిన రారాజులు, ఏలికలు నేలను కలిసి మరుగున పడ్డారు. శాస్త్ర విజ్ఞానం వచ్చిపోతుంది; నిలిచిన దేదైనా ఉంటే, అది పాతగిలిపోతుంది. అంటే, మానవ జ్ఞానంగాని, సాధనాలు గాని స్థిరమైనవికావని చెప్పకుండానే తేలిపోతున్నాయి.
ఇట్టి అస్థిరమైన మానవ ప్రగతి పధంలో, స్థిరంగా నిలిచేది ఏదైనా ఉందా అని వెదికితే, బైబిలు ఒక్కటే కానవచ్చింది! కాలం దాన్ని పాతగిలచేయలేక పోయింది. దానిని లేకుండా చేయాలని పూనుకున్న భూపతులు, చక్రవర్తులు మట్టిపాలయ్యారు. దాన్ని మటుమాయం చేయాలని కంకణం కట్టుకున్న విమర్శలు వెలవెలపోతూ, దాని వన్నెను వెలుపలికి తెచ్చాయి. దీనికి ఈ పుస్తకమే రుజువు! కావాలంటే స్వయంగా పరిశీలించి చూచుకో.
వేల సంవత్సరాలు కేవలం చేతి ప్రతులుగనే కొనసాగిన హేతువుచేత అక్షరాలు కొన్ని చెరిగిపోయినందుకు గాని, ఉన్నపాటునే తర్జుమా చేయబడినందున కన్పించే మానవ దోషాలకుగాని, బైబిలు క్షమాపణ చెప్పుకోదు. సమస్త ద్వేషం అసూయ, విమర్శ, వితండవాదం, ఆటంకం-మొదలైనవాటిగుండా దూసుకొని పోతూ తన స్థితిని తాను రుజువు చేసికోగలిగే సాటిలేని మేటి-బైబిలు!!
I want this book sir
ReplyDelete